బీటెక్లో మెకానికల్ చేసి జాబ్ కోసం ట్రై చేస్తున్నారా..? హెచ్పీసీఎల్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి..

బీటెక్లో మెకానికల్ చేసి జాబ్ కోసం ట్రై చేస్తున్నారా..? హెచ్పీసీఎల్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి..

హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్​పీసీఎల్) జూనియర్ ఎగ్జిక్యూటివ్  పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు హెచ్​పీసీఎల్ వెబ్​సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ మే 21.

పోస్టులు: 103
పోస్టులు: జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్) 11, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) 17, జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఇనుస్ట్రుమెంటేషన్) 06, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కెమికల్) 41, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ అండ్ సేఫ్టీ) 28.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఇనుస్ట్రుమెంటేషన్, ఇనుస్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇనుస్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కెమికల్ టెక్నాలజీ ఫైర్ అండ్ సేఫ్టీలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిప్లొమాలో అన్ రిజర్వ్డ్/ ఓబీసీ నాన్ క్రిమిలేయర్, ఈడబ్ల్యూఎస్ 60 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
లాస్ట్ డేట్: మే 21.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ రిజర్వ్​డ్, ఓబీసీ(నాన్ క్రిమిలేయర్), ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1180 చెల్లించాల్సి ఉంటుంది. 
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్/ గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఫిట్ నెస్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఉంటుంది. 

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్  రెండు భాగాలుగా ఉంటుంది. జనరల్ ఆప్టిట్యూడ్ టెస్టులో ఇంగ్లీష్​ లాంగ్వేజ్, క్వాంటిటీవ్ అప్టిట్యూడ్ టెస్ట్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ ప్రిటేషన్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్టులో భాగంగా సంబంధిత ట్రేడ్ పై ప్రశ్నలు  ఉంటాయి. సీబీటీలో ఉత్తీర్ణత సాధించిన వారిని గ్రూప్ డిస్కషన్​కు, ఆ తర్వాత ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.