
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు డిజిటల్ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. ఈ ఫ్లెక్సీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 1991 బ్యాచ్ కు చెందిన విద్యార్థులు ఈ ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. ఫ్లెక్సీలో.. 1991 బ్యాచ్ మేట్స్ తో జగన్ ఉన్నప్పటి ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. సీఎం కాబోతున్న జగన్ ను చూస్తే గర్వకారణంగా అనిపిస్తోందని అందులో ప్రశంసించారు. కాబోయే సీఎంకు కంగ్రాచ్యులేషన్స్ అని విష్ చేశారు జగన్ బ్యాచ్ మేట్స్.