నల్గొండ, వెలుగు: హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడంతో సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చని కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో 14 నుంచి 15 సంవత్సరాల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రభుత్వాస్పత్రిలో ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా మొదటి దశలో 21 వేల మంది బాలికలను గుర్తించినట్లు తెలిపారు.
వారికి తల్లిదండ్రుల సమక్షంలో టీకా వేస్తున్నట్టు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమంపై తల్లిదండ్రులు, బాలికలకు అవగాహన కల్పించాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ అధికారి వేణుగోపాల్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ నగేష్, ఆర్ఎమ్ఓ మహేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
