ముదిగొండ హాస్టల్‌‌‌‌ ఘటనపై నివేదిక ఇవ్వండి

ముదిగొండ హాస్టల్‌‌‌‌ ఘటనపై నివేదిక ఇవ్వండి
  • సుమోటోగా స్వీకరించిన హెచ్​ఆర్సీ

బషీర్​బాగ్, వెలుగు: నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌‌‌‌లో విద్యార్థినులు అస్వస్థతకు గురవడంపై హెచ్​ఆర్సీ స్పందించింది. మంగళవారం పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగా ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది.

 ఆగస్టు 28లోగా సమగ్ర  నివేదిక ఇవ్వాలని రాష్ట్ర  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.  సంఘటనపై హెచ్​ఆర్సీకి ఫిర్యాదుముదిగొండ హాస్టల్​ ఘటనపై బీసీల దళ్ అధ్యక్షుడు, న్యాయవాది దుండ్ర కుమారస్వామి మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే సంఘటన చోటుచేసుకుందన్నారు. స్వతంత్ర కమిటీ వేసి, విచారణ జరపాలని కోరారు.  

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

పద్మారావునగర్: మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేశారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫుడ్ కాంట్రాక్టర్ ను వెంటనే సస్పెండ్ చెయ్యాలని కోరారు.