
విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మే 30న సినిమా విడుదల కానుంది. తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. శుక్రవారం ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు.
అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ మెలోడీకి కృష్ణకాంత్ క్యాచీ లిరిక్స్ అందించాడు. ‘ఏదో ఏదో గమ్మత్తుల.. ఏంటి కల... ఏదో ఏదో అయ్యేంతల.. పొంగే అల ముంచేనిల..’అంటూ సాగిన పాటను అనిరుధ్, అనుమిత నదేశన్ కలిసి పాడిన తీరు ఆకట్టుకుంది.
‘చీకట్ల దారుల్లో నీచూపే ఓ నిప్పే.. దూకేసా అందుట్లో ఏముంది నాకంటే.. తూటాల వర్షాన పువ్వేదో పూసేనా.. లోకంకే చాటేనా.. హృదయం లోపల..’అంటూ విజయ్, భాగ్యశ్రీ మధ్య ఉన్న ప్రేమను చూపిస్తూ సాగిన ఈ పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ ఇంప్రెస్ చేసింది. విజయ్ మాస్ లుక్‌లో కనిపిస్తుండగా, భాగ్యశ్రీ ట్రెడిషినల్ గెటప్‌లో ఆకట్టుకుంది. ఈ సాంగ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విజయ్.. ‘అనిరుధ్‌తో కలిసి వర్క్ చేయాలనే నా కల నా పదమూడో సినిమాతో తీరింది’అని పోస్ట్ చేశాడు.