War 2 Trailer: ఎన్టీఆర్ ‘వార్ 2’ ట్రైలర్ అప్డేట్.. మీ క్యాలెండర్లో ఈ డేట్ మార్క్ చేసుకోండి

War 2 Trailer: ఎన్టీఆర్ ‘వార్ 2’ ట్రైలర్ అప్డేట్.. మీ క్యాలెండర్లో ఈ డేట్ మార్క్ చేసుకోండి

జూనియర్ ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘వార్ 2’ (War 2). కియారా అద్వానీ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. ఆగస్టు 14న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా ఈ చిత్రం విడుదల కాబోతోంది.

దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరెకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. టీజర్తో భారీస్థాయిలో అంచనాలు పెంచిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. జూలై 25న ‘వార్ 2’ ట్రైలర్ రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

'ఎన్టీఆర్, హృతిక్.. మన ఇండియాన్ సినిమా ఐకాన్స్. వీరి అద్భుత ప్రయాణం సిద్ధమైంది. అందుకు ముందుగా 'వార్ 2' ట్రైలర్ జూలై 25న విడుదల కానుంది. చూసేయండి. ఆ తర్వాత ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో హిందీ, తెలుగు & తమిళ భాషలలో విడుదల కానుంది!' అని మేకర్స్ పోస్ట్లో వెల్లడించారు. దాదాపు మూడు నిమిషాలతో కూడిన థియేట్రికల్ ట్రైలర్ లను డిజైన్ చేసినట్లు సమాచారం. 

YRF స్పై యూనివర్స్:

ఆదిత్య చోప్రాకు చెందిన యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రం YRF స్పై యూనివర్స్ లో ఆరవ పార్ట్. సినిమా విడుదలకు నెల రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో మూవీ మేకర్స్ అధికారిక యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ పై భారీ అంచనాలున్నాయి.

మే 20న రిలీజైన వార్ 2 టీజర్ రిలీజై మరిన్ని అంచనాలు పెంచింది. ఇందులో నెవెర్ బిఫోర్ అనేలా..హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలలో ఎన్టీఆర్ అదరగొట్టాడు. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ మధ్య వచ్చే ఫైట్ సీన్స్ గూస్బంప్స్ తెప్పించాయి. ఇది కదా అసలైన బాలీవుడ్ అరంగేట్రం అంటే అని.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి ఇపుడు రానున్న ట్రైలర్ ఎలాంటి సీన్స్ తో రానుందో అనే ఆసక్తి నెలకొంది.