
ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో బర్త్ డే వస్తుందంటే.. కొత్త చిత్రాల అప్‌డేట్స్, టీజర్స్‌తో అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతారు మేకర్స్. ప్రస్తుతం తారక్ వరుస చిత్రాల్లో నటిస్తుండడంతో అభిమానులు ఈసారి బర్త్ డేను ఓ రేంజ్‌లో ఊహించుకున్నారు. ఇప్పటికే ‘వార్ 2’ టీమ్ నుంచి గ్లింప్స్ రాబోతోందని హృతిక్ ప్రకటించాడు. ఇక ప్రశాంత్ నీల్ సినిమా నుంచి కూడా వీడియో గ్లింప్స్ రాబోతోందని ఆశించారు అభిమానులు. శనివారం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
ఇది పూర్తిగా ‘వార్ 2’ ప్రచార సమయమని, ఆ సినిమాను గౌరవిస్తూ.. మన మాస్ మాస్ మిస్సైల్‌ను మరొక సరైన సమయం చూసి విడుదల చేద్దాం అని చెప్పారు. ఈసారి బర్త్ డే ను ‘వార్ 2’తో జరుపుకోవాలని అభిమానులను కోరారు. మొత్తానికి ‘డ్రాగన్’ నుంచి ఎలాంటి అప్‌డేట్ ఉండదని స్పష్టం చేశారు.
ఇక ఎన్టీఆర్ లేకుండా ఓ షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో పూర్తి చేసిన ప్రశాంత్ నీల్.. ఇటీవల ఎన్టీఆర్‌తో ఓ షెడ్యూల్‌ని కర్ణాటకలో పూర్తి చేశాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.