కడుపులోంచి కోట్ల విలువైన కొకైన్ క్యాప్సూల్స్

కడుపులోంచి కోట్ల విలువైన కొకైన్ క్యాప్సూల్స్

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఉగాండా నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర 992 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి 91 కొకైన్ క్యాప్సూల్ ను మింగడం ద్వారా స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. అనుమానంతో అతడిని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు... కడుపులోంచి కొకైన్ క్యాప్సూల్స్ బయటకు తీశారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ కోట్లలో ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అతడిపై NDPS చట్టంలోని సెక్షన్ 43b కింద కేసు పెట్టారు.