
సికింద్రాబాద్, వెలుగు: తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల కోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 17న నిర్వహించనున్న ఈ వేడుకలకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి చేసేందుకు నిజాం నిరంకుశ పాలనపై పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల ఫొటోలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్ మంగళవారం కూడా కొనసాగనుంది. విమోచన దినోత్సవ వేడుకల సందర్బంగా నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాల కోసం భారీ ఎత్తున రిహార్సల్స్ నిర్వహించారు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు.