- పిస్తా హౌస్ ఓపెనింగ్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ కార్పొరేషన్ ను రెండేళ్లలో మోడల్, గ్రీన్, సూపర్స్మార్ట్సిటీగా మార్చుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌లోని హైదరాబాద్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పిస్తా హౌస్ ను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి కానున్న నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో పిస్తా హౌస్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
కోట్లాది రూపాయలతో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. రెండు సంవత్సరాల కాలంలోనే మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు ఇటికాల మంగమ్మ శ్రీనివాస్, బొడ్డుపల్లి లక్ష్మీ, అల్లి సుభాష్‌యాదవ్, పిస్తా హౌస్ నిర్వాహకులు కొణతం నాగిరెడ్డి, వినయ్ రెడ్డి, మిథున్ రెడ్డి, నవ కిషోర్ రెడ్డి, కొణతం సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
