Toss Fixing: ఐపీఎల్ చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో షాకింగ్ సీన్ చోటు చేసుకుంది. టాస్ వేసే సమయంలో మ్యాచ్ రెఫరీ ప్రకాష్ భట్, రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ హెడ్స్/టైల్స్ కాల్‌ను సరిగ్గా వినకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. మొదట తానే టాస్ గెలిచానని భావించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడటానికి ముందుకు వెళ్లాడు. కానీ సరిగ్గా అదే టైమ్‌లో మ్యాచ్ రెఫరీ జోక్యం చేసుకుని, గందరగోళం వల్ల టాస్‌ను రెండోసారి వేయాల్సిందేనని తేల్చి చెప్పారు.
టాస్ గెలిచి రాజస్థాన్:
రెండోసారి వేసిన టాస్‌లో ఫైనల్‌గా రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. అయితే, ఆ తర్వాత మాట్లాడిన శుభ్‌మన్ గిల్.. తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మొదటిసారి వేసినప్పుడు టాస్ గెలిచింది నేనే అని లైవ్‌లోనే క్లియర్ కట్‌గా స్టేట్మెంట్ ఇచ్చాడు.
సోషల్ మీడియాలో ఫిక్సింగ్ రూమర్స్:
ఈ ఇన్సిడెంట్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఇది కేవలం కన్ఫ్యూజన్ కాదు.. మ్యాచ్‌ను ఫిక్స్ చేసేందుకు జరిగిన ప్రయత్నమే అంటూ నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై విరుచుకుపడుతున్నారు. గుజరాత్ టైటాన్స్‌కు ఫేవర్‌గా టాస్‌ను రిగ్ (Rigged) చేయడానికి చూశారు.. కానీ లక్కీగా మళ్లీ కాయిన్ స్పిన్ చేయాల్సి వచ్చిందని ఒక యూజర్ కామెంట్ చేయగా.. ఇది పక్కా డే-లైట్ రాబరీ (పగటి దొంగతనం)! గుజరాత్ స్పష్టంగా టాస్ గెలిచింది.. కానీ కావాలనే మళ్లీ టాస్ వేయించారంటూ టైటాన్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
ఐపీఎల్ క్వాలిఫైయర్ 2 వంటి హై-స్టేక్స్ నాకౌట్ మ్యాచ్‌లో ఇలాంటి బ్లండర్ మిస్టేక్ జరగడం క్రికెట్ సర్కిల్స్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టాస్ విషయంలోనే ఇంత డ్రామా జరిగితే.. ఇక అసలు మ్యాచ్ లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అని కుర్రకారు ఫుల్ ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు.
🚨TOSS DRAMA IN QUALIFIER 2.
— U' (@toxifyxe) May 29, 2026
-Toss flipped twice in today's GT vs RR qualifier 2 Game. pic.twitter.com/WMgVvEUYwR
Toss fixing... ? pic.twitter.com/yX7lIhhBr7
— Nani (@saikiran_nani10) May 29, 2026
