ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2 బిగ్ ఫైట్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ స్టేడియంలో కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ డూ-ఆర్-డై (Do-or-Die) మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడంతో.. గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ చేసేందుకు మైదానంలోకి రాబోతుంది.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. మేము మొదట బ్యాటింగ్ చేయబోతున్నాం.. పిచ్ దాదాపు ఎలిమినేటర్ లాగే కనిపిస్తోంది.. కానీ మ్యాచ్ జరిగే కొద్దీ సెకండ్ హాఫ్‌లో పిచ్ కాస్త స్లో అయ్యే ఛాన్స్ ఉందని నేను భావిస్తున్నాను.. మా దగ్గర దానికి తగ్గ పక్కా బౌలింగ్ లైన్అప్ ఉంది.. మేము చేయాల్సిందల్లా ఈ 40 ఓవర్ల పాటు అత్యుత్తమ క్రికెట్ ఆడటమే.. ఏది ఏమైనా బెస్ట్ టీమ్ గెలుస్తుంది.. ఇక ఇంజూరీస్, రికవరీ విషయంలో మా సపోర్ట్ స్టాఫ్ అద్భుతంగా హెల్ప్ చేశారు.. మేము జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నామని వెల్లడించాడు.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే మేము కూడా మొదట బ్యాటింగే తీసుకునే వాళ్లం.. ఈ వికెట్ మీద ఆల్రెడీ 40 ఓవర్ల క్రికెట్ (ఎలిమినేటర్ మ్యాచ్) ఆడారు కాబట్టి పిచ్ ప్రవర్తనలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు.. మాకు ఇది Now or Never లాంటి పరిస్థితి.. ఫైనల్ చేరడానికి మా శక్తినంతా ధారపోస్తాం.. ఈ మ్యాచ్ కోసం మా జట్టులో ఒక కీలక మార్పు చేశాం.. సాయి కిషోర్ మళ్లీ జట్టులోకి వచ్చాడని గిల్ తెలిపాడు.
ఇరు జట్లు:
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, దసున్ షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా
🚨Toss update from New Chandigarh 🚨@rajasthanroyals won the toss and elected to bat first against @gujarat_titans
— IndianPremierLeague (@IPL) May 29, 2026
Updates ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR pic.twitter.com/VuLXsWl9Ih
