తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీ‌వారి ద‌ర్శనానికి 24 గంట‌ల స‌మ‌యం

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీ‌వారి ద‌ర్శనానికి 24 గంట‌ల స‌మ‌యం

తిరుమల తిరుపతి ఆయానికి (టీటీడీ) భక్తుల రద్దీ భారీ పెరుగుతోంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల ఆలయం కిటకిటలాడుతుంది. జూన్ 3వ తేదీ శనివారం శ్రీవారి దర్శనాకి భక్తులు పోటెత్తారు. అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనం కోసం దాదాపుగా 24 గంటల సమయం వెయిటింగ్ చేస్తున్నారు.

క్యూలో ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యూలో వివిధ పాయింట్ల వద్ద ఆహారం, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. మరోవైపు జూన్ 4న తిరుమల ఆలయంలో జ్యేష్ఠాభిషేకం జరగనుంది. జ్యేష్ఠాభిషేకం దృష్ట్యా ఆదివారం ఆర్జిత సేవను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.