
హైదరాబాద్ లొని ఓ టూవీలర్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాగోల్-బండ్లగూడ రోడ్డులోని డైమండ్ మల్టీ బ్రాండ్ టూవీలర్ షోరూంలో బుధవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో 20 కొత్త బైక్‌లతో పాటు.. ఐదు సర్వీసింగ్‌కు వచ్చిన బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు ఆ షోరూం యజమాని తెలిపారు.