అక్రమంగా తరలించిన బంగారంతో పాటు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ అధికారులు. ఈస్ట్ మారేడుపల్లిలోని షైన్ హాస్పిటల్‌పై దాడులు చేసిన అధికారులు నలభై బంగారు బిస్కెట్లతో పాటు 2 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని ఇద్దరు వ్యక్తులు కారులో క్యాలికట్ నుంచి మైసూర్ మీదుగా హైదరాబాద్‌కు తరలించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. బంగారు బిస్కెట్ల విలువ రెండు కోట్ల రూపాయలకు పైగా ఉంటుందన్నారు అధికారులు.

