ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు బ్రేక్

ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు బ్రేక్

ప్రపంచ దేశాల్లో ఇంటర్నెట్ ఒక్కసారిగా బంద్ అయింది. ఇంటర్నెట్ అంతరాయంతో కొన్ని వేల వెబ్ సైట్లు పనిచేయకుండా పోయాయి. మీడియా, బిజినెస్, గవర్నమెంట్ ఇలా చాలా వెబ్ సైట్లు ఓపెన్ కావడంలేదు. న్యూయార్క్ టైమ్స్, CNN, బ్లూమ్ బర్గ్, అమెజాన్... ఇలా ప్రముఖ వెబ్ సైట్లు ఏవీ ఓపెన్ కావడంలేదు. అయితే ఇప్పటికైతే ఇండియాలో మాత్రం అంతా బాగానే ఉంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇంటర్నెట్ ఔటేజ్ తో కుదుపు వచ్చినట్టైంది. సమస్య పరిష్కారానికి టాప్ కంపెనీలు రంగంలోకి దిగాయి.