మణికొండలో భారీ భూదందా.. 5 ఎకరాలు ల్యాండ్ కోసం రూ.3 కోట్ల డీల్

మణికొండలో భారీ భూదందా.. 5 ఎకరాలు ల్యాండ్ కోసం రూ.3 కోట్ల డీల్

మణికొండ పోకలవాడలో భారీ భూదందా వెలుగలోకి వచ్చింది.  ధరణి పొర్టల్లో గోల్మాల్ చేసి  కోట్లు విలువ చేసే ల్యాండ్ ను కబ్జా చేశారు.   కలెక్టర్లు ఎలక్షన్ హడావిడిలో ఉండగా  ధరణిలో పాస్ బుక్కులు జారీ చేశారు.   రంగారెడ్డి జిల్లా ఇద్దరు కలెక్టర్లు సంతకాలతో పాస్ బుక్కులు జారీ అయ్యాయి.   5 ఎకరాలు ల్యాండ్ కోసం 3 కోట్లు డీల్ చేశారు.  ఉద్యోగులు కొంత డబ్బు తీసుకున్న తర్వాత కలెక్టర్ల సంతకాలతో పాస్ బుక్కులు జారీ అయ్యాయి.   

బ్లాక్ లిస్టులో ఉన్న ల్యాండ్ కు  పాసు బుక్కులు జారీ కావడంతో ఎమ్మార్వో కంగుతున్నారు.  దీనిపై పోలీసులకు ఎమ్మార్వో ఫిర్యాదు చేయడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది.   ఇద్దరు ధరణి ఉద్యోగులతో పాటు మరో 8 మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.  అంతేకాకుండా ల్యాండ్ ను తమ పేరుపై రిజిస్టర్ చేసుకున్న ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఉన్నతాధికారుల పాత్రపై  సైబరాబాద్ పోలీసులు ఆరా తీస్తున్నారు.