గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీకి మస్తు నామినేషన్లు

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీకి మస్తు నామినేషన్లు

నేడు నామినేషన్ల పరిశీలన

ఉపసంహరణకు 26 వరకు గడువు

మార్చి 14న పోలింగ్‌ 

110 మంది హైదరాబాద్ నుంచి పోటీ

78 మంది వరంగల్ బరిలో

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు భారీగా వచ్చాయి. హైదరాబాద్‌ రంగారెడ్డి మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానానికి 110 మంది, నల్గొండ ఖమ్మం వరంగల్‌ స్థానానికి 78 మంది నామినేషన్లు వేశారు. చివరి రోజైన మంగళవారం హైదరాబాద్‌ సీటుకు ఏకంగా 51 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లను బుధవారం పరిశీలించనున్నారు. ఉపసంహరణకు ఈ నెల 26 వరకు గడువుంది. మార్చి 14న రెండు స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

గ్రాడ్యుయేట్‌‌‌‌ ఎమ్మెల్సీకి మస్తు నామినేషన్లు

హైదరాబాద్‌‌‌‌ స్థానం నుంచి సిట్టింగ్‌‌‌‌ ఎమ్మెల్సీ రాంచందర్‌‌‌‌రావు బీజేపీ నుంచి నామినేషన్‌‌‌‌ వేశారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ టికెట్‌‌‌‌ను మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు సురభి వాణీదేవికి ఇచ్చారు. కాంగ్రెస్‌‌‌‌ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, టీడీపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌‌‌‌. రమణ, ఇండిపెండెంట్‌‌‌‌ క్యాండిడేట్లుగా సామల వేణు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌‌‌‌ నాగేశ్వర్‌‌‌‌, రిటైర్డ్‌‌‌‌ ఇంజనీర్‌‌‌‌ దొంతుల లక్ష్మీనారాయణ, టీచర్ల సంఘం నేత హర్షవర్ధన్‌‌‌‌రెడ్డి, ప్రైవేట్‌‌‌‌ కాలేజీల అసోసియేషన్‌‌‌‌ నేత గౌరీసతీశ్‌‌‌‌ తదితరులు నామినేషన్‌‌‌‌లు వేశారు. నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి సిట్టింగ్‌‌‌‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌‌‌రెడ్డి టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి నామినేషన్‌‌‌‌ వేశారు. బీజేపీ నుంచి ప్రేమేందర్‌‌‌‌రెడ్డి, కాంగ్రెస్‌‌‌‌ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నా యక్‌‌‌‌, ఇండిపెండెంట్‌‌‌‌ క్యాండిడేట్లు ప్రొఫెసర్‌‌‌‌ కోదండరాం, చెరుకు సుధాకర్‌‌‌‌, తీన్మార్‌‌‌‌ మల్ల న్న, రాణి రుద్రమరెడ్డి, వామపక్షాల నుంచి జర్నలిస్టు జయసారథిరెడ్డి పోటీలో ఉన్నారు.

నిరుద్యోగుల బాధలు తీరలె: గౌరీసతీశ్‌‌‌‌

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా నిరుద్యోగుల బాధలు తీరలేదని ప్రైవేట్‌‌‌‌ కాలేజీల అసోసియేషన్‌‌‌‌ నాయకుడు గౌరీసతీశ్‌‌‌‌ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌ స్థానానికి నామినేషన్‌‌‌‌ వేశాక ఆయన మీడియాతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రం తెచ్చుకున్నామని, అయినా అన్యాయం జరుగుతోందని హైదరాబాద్‌‌‌‌ స్థానానికి నామినేషన్‌‌‌‌ వేసిన రిటైర్డ్‌‌‌‌ ఇంజనీర్‌‌‌‌, తెలంగాణ ఇంజనీర్స్‌‌‌‌ ఫోరం కన్వీనర్‌‌‌‌ లక్ష్మీనారాయణ అన్నారు. 

గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్‌‌‌‌కు ఇద్దరు అబ్జర్వర్లు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇద్దరు అబ్జర్వర్లను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్ స్థానానికి ఎంసీహెచ్ఆర్డీ అడిషనల్​ డైరెక్టర్‌‌‌‌ హర్‌‌‌‌ప్రీత్‌‌‌‌సింగ్‌‌‌‌ను.. వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానానికి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సబ్యసాచిని నియమించింది.