ఆస్ట్రేలియాలో నర్సింగ్‌కు అపార అవకాశాలు

ఆస్ట్రేలియాలో నర్సింగ్‌కు అపార అవకాశాలు

 

  • ఆస్ట్రేలియాలో నర్సింగ్‌కు అపార అవకాశాలు
  • ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి అంబర్జడే సాండర్సన్‌ 

పంజాగుట్ట, వెలుగు: భారత్ ఆస్ట్రేలియాకి  భౌగోళికంగా తేడాలు ఉన్నప్పటికీ వృత్తిపరమైన శిక్షణ, అధ్యయనాలతో కలిసి పని చేస్తామని ఆస్ట్రేలియా హెల్త్‌ మినిస్టర్‌‌ అంబర్జడే సాండర్సన్‌ అన్నారు.  భారత పర్యటనలో  భాగంగా మంత్రి సాండర్సన్‌  హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో  సోమవారం జరిగిన  ఆరోగ్య శిక్షణ శిబిరంలో  పాల్గొన్నారు.  అనంతరం మంత్రి సాండర్సన్‌  మాట్లాడుతూ.. నర్సింగ్ ప్రొహిబిషన్‌ని భారత్,  ఆస్ట్రేలియా  రెండు దేశాలు ఎంతో గౌరవిస్తాయన్నారు.  ఆస్ట్రేలియాలో  వైద్యులు, నర్సింగ్,  వైద్య అనుబంధ సాంకేతిక మిత్రులకు  అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. నిమ్స్ డైరెక్టర్ బీరప్ప ఇక్కడి వైద్య సదుపాయాలను వివరించారు.