మెదక్ జిల్లాలో మూడో విడతలో భారీగా నామినేషన్లు

 మెదక్ జిల్లాలో మూడో విడతలో  భారీగా నామినేషన్లు
  • మెదక్​ జిల్లాలో సర్పంచ్​కు 1028, వార్డులకు 3528
  • సిద్దిపేట జిల్లాలో సర్పంచ్​కు 1192, వార్డులకు 3879
  • సంగారెడ్డి జిల్లాలో సర్పంచ్​కు 1,344, వార్డులకు  4,012

మెదక్​/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. మెదక్ జిల్లాలో 183, సిద్దిపేట జిల్లాలో 163, సంగారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీలకు ఈ విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. 

సంగారెడ్డి జిల్లాలో..

గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 1,344 నామినేషన్లు, వార్డులకు 4,012 నామినేషన్లు దాఖలయ్యాయి. నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని కల్హేర్, కంగ్టీ, మనూర్, నాగల్ గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట్, సిర్గాపూర్ మండలాలు, జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని న్యాల్కల్ మండలాల పరిధిలో 234 గ్రామ పంచాయతీలు, 1,960 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

సిద్దిపేట జిల్లా..

మండలం    జీపీలు    నామినేషన్లు    వార్డులు    నామినేషన్లు

అక్కన్న పేట    38    237    306    697

చేర్యాల    20    179    184    538

ధూల్మిట్ట    11    75    94    258

హుస్నాబాద్     17    136    140    348

కోహెడ    27    181    244    652

కొమురవెల్లి    11    91    100    319

కొండపాక       15    140    146    514

కుకునూరుపల్లి    14    80    120    279

మద్దూరు    10    73    98    276

మొత్తం    163    1,192    1,432    3879

మెదక్ జిల్లా..

మండలం    జీపీలు    నామినేషన్లు    వార్డులు       నామినేషన్లు

చిలపిచెడ్    19    111    156    348

కౌడిపల్లి    35    194    280    613

కొల్చారం    21    125    192    446

మాసాయిపేట    13    66    106    255

నర్సాపూర్​    35    183    282    660

శివ్వంపేట    37    209    312    770

వెల్దుర్తి    23    140    200    436

మొత్తం    183    1,028    1,528    3,528