న్యూఇయర్‌‌‌‌ కోసం ఓయోలో భారీగా రూమ్ బుకింగ్స్

న్యూఇయర్‌‌‌‌ కోసం ఓయోలో భారీగా రూమ్ బుకింగ్స్
  • ప్రకటించిన కంపెనీ ఫౌండర్‌‌‌‌ రితేష్ అగర్వాల్‌‌

న్యూఢిల్లీ: కిందటి సవంత్సరాన్ని ఓ రేంజ్‌‌లో ఓయో ముగించింది. 2020, ఏప్రిల్ తర్వాత నుంచి చూస్తే మొత్తం 90 పాండమిక్ వీక్స్‌‌ కంటే డిసెంబర్ 30, 31 తో ముగిసిన వారంలో ఎక్కువ బుకింగ్స్ జరిగాయని ఓయో ఫౌండర్‌‌‌‌ రితేష్‌‌ అగర్వాల్ ప్రకటించారు.  గ్లోబల్‌‌గా డిసెంబర్‌‌‌‌ 31 తో ముగిసిన వారంలో రూ. 110 కోట్ల (14.6 మిలియన్ల) విలువైన బుకింగ్స్ జరిగాయని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. కిందటేడాది డిఫరెంట్‌‌గా కనిపిస్తూనే తెలిసినట్టు అనిపించిందని రితేష్ అన్నారు. ఏడాదిలోనే అతిపెద్ద వీకెండ్ గురించి ఆయన కొన్ని విషయాలను పంచుకున్నారు. ‘ఈ న్యూఇయర్‌‌‌‌ కోసం మా దగ్గర హాఫ్ మిలియన్ రాత్రులు బుక్ చేసుకున్న 10 లక్షల మంది ప్రజలకు థ్యాంక్స్‌. ఓయోలో అందరికి ఇది చాలా బిజీ న్యూఇయర్‌‌‌‌’ అని రితేష్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా  2016  న్యూఇయర్ (డిసెంబర్ 30, 31) టైమ్‌‌లో 1.02 లక్షల రూమ్స్‌‌ బుక్ అయ్యాయని, 2021లో ఇదే టైమ్‌‌లో 5.03 లక్షల రూమ్స్ బుక్ అయ్యాయని పేర్కొన్నారు. 

న్యూఇయర్ కోసం ఫుల్ బుకింగ్స్‌‌
న్యూఇయర్ కోసం ఓయో నుంచి  రూమ్స్ బుక్ చేసుకున్నవాళ్లలో 58 శాతం మంది అదే రోజు బుక్ చేసుకున్నారని అన్నారు.  ‘2020 లో డిసెంబర్ 31 న న్యూఇయర్ కోసం రూమ్స్ బుక్ చేసుకున్నవారు 61 శాతం మంది. అంతకు ముందు ఏడాది ఇదే రోజున 57 శాతం మంది, 2018 లో ఇదే రోజున 63 శాతం మంది రూమ్స్ బుక్ చేసుకున్నారు’ అని రితేష్ పేర్కొన్నారు.  2015 లో ఓయో కేవలం 127 సిటీలలో, 1,229 హోటల్స్‌‌లలోని రూమ్స్‌‌ను   మాత్రమే అందుబాటులో ఉంచేది.  ఇవన్నీ అప్పుడు ఇండియాలో ఉన్నవే.  2021 నాటికి మొత్తం 35 దేశాల్లోని 10 వేల సిటీలలో 1,59,000 హోటల్స్‌‌లలోని రూమ్‌‌లను కంపెనీ అందుబాటులో ఉంచుతోంది.