స్కాలర్‎షిప్ పేరుతో భారీ స్కాం.. రూ. కోటికి పైగా వసూల్

V6 Velugu Posted on Sep 24, 2021

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‎లో భారీ మోసం వెలుగుచూసింది. స్కాలర్‎షిప్ పేరుతో విద్యార్థుల నుంచి వేల రూపాయలు వసూలు చేసి.. ఉడాయించారు. గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ పేరుతో విద్యార్థులకు స్కాలర్‎షిప్‎లు ఇస్తామంటూ నిర్వాహకులు అప్లికేషన్ల ద్వారా విద్యార్దుల పూర్తి వివరాలు తీసుకున్నారు. సర్వీస్ చార్జీల పేరుతో ఒక్కొక్కరి వద్ద 3 వేల నుంచి 4 వేల రూపాయల చొప్పున.. అందరి నుంచి దాదాపు కోటి రూపాయల వరకు వసూల్ చేశారు. స్కాలర్‌షిప్‎లు ఏమయ్యాయంటూ విద్యార్థుల పేరెంట్స్ నిలదీయడంతో నిర్వాహకులు పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అత్తాపూర్‎లోని గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ కార్యాలయంపై పోలీసులు దాడులు చేసి.. 1500 అప్లికేషన్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. 

Tagged Rangareddy district, scholarship, students, fraud, scam, scholarship scam, green leafs foundation

Latest Videos

Subscribe Now

More News