కరీంనగర్లో భారీ చోరీ.. రూ.30 లక్షల విలువైన బంగారు నగలు ఎత్తుకెళ్లిన దొంగలు

కరీంనగర్లో భారీ చోరీ.. రూ.30 లక్షల విలువైన బంగారు నగలు ఎత్తుకెళ్లిన దొంగలు

బంగారం ధర పెరగటంతో దొంగల ఫోకస్ అంతా ఇప్పుడు గోల్డ్ పైనే ఉన్నట్లు కనిపిస్తోంది. తక్కువ టైం లో ఈజీగా లక్షాధికారి కావచ్చునని భావిస్తున్నారో ఏమో కాని ఎవరూ లేని ఇళ్లను టార్గెట్ చేసి బంగారం ఎత్తుకెళ్తున్నారు. కరీంనగర్ లో గురువారం (ఆగస్టు 07) భారీ ఎత్తున బంగారం దొంగిలించారు దొంగలు. 

వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ వివేకానందపురి కాలనీలోని భార్గవి అపార్ట్మెంట్ లో భారీ చోరీ జరిగింది. అపార్ట్ మెంట్ లోని 301 ఫ్లాట్ లో  30 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు దొంగలు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగల కొట్టి చోరీకి పాల్పడారు

బాధితులు ఇంటికి వచ్చి చూడగా తాళం పగలగొట్టి.. బీరువా తాలం తీసి ఉండటం గమనించి ఆందోళనకు గురయ్యారు. బంగారం దొంగిలించినట్లు గుర్తించి వెంటనే త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇంటి యజమాని గంధం వేద వ్యాస్.  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.