హైదరాబాద్ సిటీలో భారీ వర్షం.. భారీ ట్రాఫిక్ జాం

హైదరాబాద్ సిటీలో భారీ వర్షం.. భారీ ట్రాఫిక్ జాం

హైదరాబాద్ సిటీలో భారీ వర్షం.. ఈ వర్షంతోపాటు భారీగా ట్రాఫిక్ జాం. మార్నింగ్ ఆఫీసులకు వెళ్లే వాళ్లతో మామూలుగానే హైదరాబాద్ రోడ్లు కిటకిటలాడతాయి. ట్రాఫిక్ జాం సహజంగానే ఉంటుంది. 2025, అక్టోబర్ 29వ తేదీ బుధవారం ఉదయం నుంచి వర్షంతోపాటు భారీ ట్రాఫిక్ జాం అయ్యింది సిటీ. చాలా చోట్ల వాహనాలు నిదానంగా సాగుతున్నాయి. వర్షం  కారణంగా వ్యక్తిగత వాహనాలు పెరగటంతోపాటు.. రోడ్లపై చాలా చోట్ల నీళ్లు చేరటంతో నిదానంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. 

హైదరాబాద్ సిటీ ఐటీ కారిడార్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ రూట్ లో ఆఫీసులకు బయలుదేరిన వాళ్లు చుక్కలు చూశారు. రెగ్యులర్ గా గంట.. గంటా 20 నిమిషాల్లో ఇంటి నుంచి ఆఫీసులకు చేరుకునే వాళ్లు.. ఇవాళ మాత్రం రెండు గంటల సమయం పట్టింది. కూకట్ పల్లి JNTU నుంచి హైటెక్ సిటీ, రాయదుర్గం, మాదాపూర్, కేబుల్ బ్రిడ్జి, బయోడైవర్సిటీ, ఐకియా జంక్షన్ దగ్గర వాహనాలు అత్యంత నిదానంగా సాగుతున్నాయి. 

ALSO READ : తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు

హైటెక్ సిటీ ఏరియానే కాకుండా.. సిటీలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. అల్వాల్ రైతు బజార్ సమీపంలోనూ ట్రాఫిక్ జాం ఉంది. రైతు బజారు సమీపంలోని రైల్వే వంతెనపై లారీ పంచర్ అయ్యి.. బ్రేక్ డౌన్ అయ్యింది. దీంతో తూముకుంట, తిరుమలగిరి వైపు రెండు వైపులా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఓవైపు ట్రాఫిక్ జామ్.. మరో వైపు వర్షం కురుస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. 

హైదరాబాద్ సిటీలో వర్షంతో పాటు ట్రాఫిక్ జాంతో వాహనదారులు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గంటలకొద్దీ రోడ్లపైనే ఉండాల్సిన దుస్థితి. రెగ్యులర్ టైం కంటే అర గంట, గంట సమయం ఎక్కువ ట్రాఫిక్ లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు.