
హైదరాబాద్ బేగంపేట్ ఫ్లై ఓవర్ పై రన్నింగ్ కార్ లో మంటలు చెలరేగాయి. దీంతో వాహనదారులు భయాందోళనలకు గరయ్యారు. కారులో మంటలు చెలరగేడంతో ఫ్లై ఓవర్ భారీ ట్రాఫిక్ జాం అయ్యింది.
శనివారం (జూన్ 28) బేగంపేట్ నుంచి బల్కంపేట్ వైపుగా వెళ్లే ఫ్లైఓవర్ పైన రన్నింగ్ లో ఉన్న కార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సనత్ నగర్ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని మంటలని అదుపులోకి తీసుకొచ్చారు.
కారు ప్రమాదం గురించి తెలుసుకున్న సికింద్రాబాద్ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు సనత్ నగర్ ఫైర్ అధికారులకు మద్ధతుగా వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. మంటలు చెలరేగడంతో కారులో ఉన్న వ్యక్తులు వెంటనే కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. కారు పూర్తిగా దగ్ధం అవ్వడంతో అక్కడే వదిలేసి వెళ్లారు.
ప్రమాదానికి గురైన కారు పాత ఇండికా కారుగా అధికారులు గుర్తించారు. కారు వివరాలు, ఓనర్ ఎవరనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.