
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం చార్మినార్ వద్ద మానవహారం నిర్వహించారు. ముందుగా ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపు మేరకు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ నేతృత్వంలో ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో ముస్లింలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తలాబ్ కట్ట నుంచి చార్మినార్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా తీశారు. చార్మినార్ వద్ద మానవహారంతో నిరసన తెలిపారు. ముస్లిం సమాజం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా వక్ఫ్సవరణ చట్టం చేశారని పలువురు మండిపడ్డారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, స్థానిక ముస్లింలు పాల్గొన్నారు.
వెలుగు, బషీర్బాగ్