V6 News

గ్లోబల్ సమ్మిట్ లో ఆకట్టుకున్న హ్యూమన్ డ్రోన్.. హైదరాబాదీలు తయారు చేసిందే

గ్లోబల్ సమ్మిట్ లో ఆకట్టుకున్న హ్యూమన్ డ్రోన్.. హైదరాబాదీలు తయారు చేసిందే

హైదరాబాద్ లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి.  ఒక్కోస్టాల్ ఒక్కో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాటి ఇన్నోవేషన్స్ ప్రదర్శించాయి. అయితే స్టాల్స్ ఎన్నో ఇన్నోవేషన్స్ ఉన్నా  హ్యూమన్ డ్రోన్ సందర్శకులను అందరినీ ఆకట్టుకుంది. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో స్టాఫ్, సిబ్బంది, స్టూడెంట్లు కలిసి నిర్మించిన ఈ డ్రోన్  తయారు చేశారు. 

టీహాన్ అనే హబ్ ద్వారా  సెల్ఫ్ డ్రైవింగ్ ఫర్ ఏరియల్అండ్ టెరస్టియల్ వెహికల్స్ పై పనిచేసే స్టాఫ్ దీనిని రూపొందించారు. ఇది ఒక ప్యాసింజర్ మొబిలిటీ డ్రోన్.  ఏంచక్కా ఈ డ్రోన్ ద్వారా ఆకాశ వీధిలో విహరించవచ్చు. 100 కిలోల వరకు బరువును మోసుకెళ్తుంది. ప్రస్తుతం ఒక్కరికి మాత్రమే ఇది ఫ్యాసిలిటీ గా ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు, మెడికల్ ఎక్విప్ మెంట్లతో ప్రయాణించేందుకు ఈ హ్యూమన్ డ్రోన్ ను అభివృద్ది చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Also read:- తెలంగాణతో యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ కీలక ఒప్పందం 

దీనిని ఎయిర్ అంబులెన్స్ మాదిరిగా ఉపయోగించేందుకు డెవలప్ చేస్తు్న్నట్లు చెబుతున్నారు నిర్వాహకులు. వరదల్లాంటి  విపత్తులు వచ్చిన సమయంలో కూడా ఈ డ్రోన్లను వినియోగించవచ్చంటున్నారు. ప్రస్తుతం 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న ఈ డ్రోన్ ... భవిష్యత్తులు గంటలకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 

సమ్మిట్‌‌ దగ్గర మొత్తంగా 27 స్టాల్స్‌‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ హ్యాండీ క్రాఫ్ట్స్, టూరిజం, ఎడ్యుకేషన్, ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ ,కరీంనగర్ నగిషీ, ఇక్కత్​ ఫ్యాబ్రిక్, చేర్యాల పెయింటింగ్స్, ఇతర హ్యాండీ క్రాఫ్ట్స్‌‌, వాటి ప్రత్యేకతల గురించి స్టాల్స్​నిర్వాహకులు విదేశీ ప్రతినిధులకు వివరించారు.

 ‘మూసీ నది పునరుజ్జీవనం’ కాన్సెప్ట్‌‌తో ఏర్పాటుచేసిన స్టాల్‌‌ అందరినీ ఆలోచింపజేసింది. అడ్వాన్డ్స్‌‌ టెక్నాలజీ సాయంతో పనిచేసే డ్రోన్స్ ఎగ్జిబిట్ ఆలోచింపజేసేలా ఉంది. సైబర్ క్రైమ్ కేసుల ఛేదనలో అత్యాధునిక టెక్నాలజీ వినియోగం, పోలీసులు వెళ్లలేని చోటుకి ఏఐ ఇంటిగ్రేటెడ్ డ్రోన్స్‌‌ను పంపిస్తామని అధికారులు వివరించారు.