జమ్మూకాశ్మీర్లో ఎన్కౌంటర్..హ్యూమన్ జీపీఎస్, టెర్రరిస్ట్ బాగు ఖాన్ హతం

జమ్మూకాశ్మీర్లో ఎన్కౌంటర్..హ్యూమన్ జీపీఎస్, టెర్రరిస్ట్ బాగు ఖాన్ హతం

జమ్మూకాశ్మీర్ లోని గురేజ్ ప్రాంతంలో శనివారం (ఆగస్టు30) భద్రతాదళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో అన్ని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న, మానవ జీపీఎస్ గా పిలువబడే బాగుఖాన్ ను భద్రతాదళాలు హతమార్చాయి. 

సమందర్ చాచా అని కూడా పిలువబడే బాగు ఖాన్ 1995 నుండి పీఓకేలో స్థిరపడ్డాడు. చొరబాట్లకు ఇతను కీలక సూత్రధారి.. పీవోకే వెంబడి భారత్ లో ప్రవేశించే ప్రతి ఉగ్రవాది వెనక ఇతని హస్తం ఉందని భద్రతాదళాలు చెబుతున్నాయి. నౌషెరా నార్ ప్రాంతం నుంచి భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా మరొక ఉగ్రవాదితో పాటు బాగు ఖాన్ ను కాల్చిచంపాయి భద్రతాదళాలు. 

గురెజ్ సెక్టర్ లోని వివిధ ప్రాంతాలనుంచి 100కి పైగా చొరబాట్లకు బాగుఖాన్ కీలక సూత్రధారి. ఆ ప్రాంతంలో భూభాగం ,రహస్య మార్గాల గురించి అతనికి ఉన్న లోతైన జ్ఞానం కారణంగా చొరబాట్లు అన్ని సక్సెస్ అయ్యాయి. దీంతో అతన్ని అన్ని ఉగ్రవాద గ్రూపులకు ప్రత్యేకంగా నిలిపింది.

జమ్మూ కాశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలోని గురేజ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను గురువారం భారత సైన్యం కాల్చి చంపిన రెండు రోజుల తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరిగింది .ఆపరేషన్ నౌషేరా నార్ IV కింద నౌషేరా నార్ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో బాగుఖాన్  హతమయ్యారు.బాగు ఖాన్ చనిపోవడంతో ఈ ప్రాంతంలోని ఉగ్రవాద సంస్థల లాజిస్టికల్ నెట్‌వర్క్‌కు గట్టి ఎదురు దెబ్బ.