ఫుల్ కాంట్రవర్సీలో రణ్బీర్ కపూర్ వెబ్ సీరీస్.. కేస్ ఫైల్ చేయాలంటూ పోలీసులకు NHRC నోటీసులు !

ఫుల్ కాంట్రవర్సీలో రణ్బీర్ కపూర్ వెబ్ సీరీస్..  కేస్ ఫైల్ చేయాలంటూ పోలీసులకు NHRC నోటీసులు !

బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నటించిన వెబ్ సీరీస్ లో ఉన్న సీన్స్ పై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రణ్బీర్ కేస్ ఫైల్ చేయమంటూ ముంబై పోలీసులకు ఆదేశాలివ్వడం సంచలనంగా మారింది. నిషేధిత వస్తువులు ఎలా వినియోగిస్తారని మండిపడిన NHRC .. ఆయనపై చర్యలకు ఉపక్రమించింది. 

ఇటీవలే విడుదలైన బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సీరీస్ లోని సీన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్..  ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్ర సమాచార శాఖతో పాటు ముంబై పోలీసులకు నోటీసులు జారీ చేసింది. రణ్ బీర్ తో పాటు ప్రొడ్యూసర్లు, నెట్ ఫ్లిక్స్ పైన కూడా చర్యలకు ఆదేశించింది.

ఈ వెబ్ సీరీస్ లో ఇంత వివాదాస్పదం కావటానికి కారణం.. ప్రభుత్వం నిషేధించిన ఈ-సిగరెట్ వినియోగించటమే.  ఎలక్ట్రానిక్ సిగరెట్ నిషేధ చట్టం - 2019 ని ఉల్లంఘించడమే కాకుండా.. ఎలాంటి హెచ్చరికలు, వార్నింగ్, డిస్ క్లైమర్ లేకుండా వీడియో ఉండటంపై వినయ్ జోషీ అనే వ్యక్తి కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. 

దీంతో కేంద్ర సమాచార కమిషన్ తో సెక్రెటరీకి నోటీసులు జారీ చేసింది. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడమే కాకుండా.. ఈ సీన్స్ ను వెంటనే తొలగించాలని సూచించింది. యండ్ జనరేషన్ ను ప్రభావితం చేసే ఇలాంటి సీన్స్ ఉండటానికి వీలు లేదని చెప్పింది. ఎలాంటి బాధ్యత లేకుండా.. ప్రమోషన్ కోసం ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలు చేయడంపై కమిషన్ మండిపడింది.

 బాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న ఈ వెబ్ సీరీస్ లో భారీ తారగణాన్ని దించారు నిర్మాతలు. ఇందులో రణ్ బీర్ క్యామియో రోల్ లో కనిపిస్తారు. రణ్ బీర్ తో పాటు షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ లాంటి బాలీవుడ్ అగ్రహీరోలు గెస్ట్ రోల్స్ చేశారు.