దొరికిపోతామని ట్రాప్ కెమెరాలు ఎత్తుకెళ్లారు...నలుగురు వేటగాళ్లను అరెస్ట్ చేసిన మంచిర్యాల పోలీసులు

దొరికిపోతామని ట్రాప్ కెమెరాలు ఎత్తుకెళ్లారు...నలుగురు వేటగాళ్లను అరెస్ట్ చేసిన మంచిర్యాల పోలీసులు

బెల్లంపల్లి రూరల్, వెలుగు: అడవిలో వన్యప్రాణుల వేటకు వెళ్లిన వేటగాళ్లు పులుల ట్రాకింగ్​సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లి దొరికిపోయారు. జైపూర్​ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి అటవీ రేంజ్​పరిధిలో ఇటీవల  పులి సంచరిస్తుండగా ట్రాకింగ్​ చేసేందుకు  అటవీ   ​సిబ్బంది గత మార్చిలో 4  సీసీ కెమెరాలను అమర్చారు. అదే నెలలో కెమెరాలు చోరీ అయ్యాయి. కాగా అటవీ అధికారులు నీల్వాయి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. 

బొమ్మెన గ్రామానికి చెందిన వేటగాళ్లు కోల తిరుపతి, మానేపల్లి సమ్మయ్య , భట్టు కిష్టయ్య, మడె భీమయ్య వన్యప్రాణులను వేటాడుతుంటారు. నలుగురిని అరెస్ట్ చేసి శుక్రవారం విచారించారు. అదే నెలలో రాత్రి అటవీలో నలుగురూ జంతువులను వేటాడేందుకు వెళ్లారు. పులి ట్రాకింగ్​ కెమెరాల ప్లాష్​ లైట్ కు చిక్కారు.  దీంతో భయపడి అటవీ అధికారులకు దొరికిపోతామనే భయంతో  ట్రాప్ కెమెరాలను  తీసుకెళ్లి కోల తిరుపతి ఇంట్లో దాచి ఉంచారు. ఆ తర్వాత మైలారం అడవుల్లోనూ మరోసారి వేటకు వెళ్లగా అక్కడ కూడా  సీసీ కెమెరాల ప్లాష్​కు చిక్కడంతో వాటిని ధ్వంసం చేసినట్టు అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి బ్యాటరీ  లైట్​, నాలుగు సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు.  చెన్నూర్​ రూరల్​ సీఐ సుధాకర్, ఎస్ఐ శ్యాంపటేల్​ 

ఉన్నారు.