
ఆరుగురు మృతి.. లూసియానా స్టేట్‌పై భారీ ఎఫెక్ట్
హ్యూస్టన్: అమెరికాలోని లూసియానా స్టేట్ ను హరికేన్ లారా అతలాకుతలం చేసింది. హరికేన్ ధాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు. తుపాను ధాటికి చెట్లుకూలిపోవడం వల్లే నలుగురు చనిపోయారు. టెక్సాస్ కు 35 మైళ్లదూరంలో కామెరాన్ వద్ద తీరం దాటిన హరికేన్ బలమైన గాలులతో
విరుచుకుపడింది. దీనిని కేటగిరీ 4 స్టార్మ్ గా ప్రకటించారు. వేలాది ఇండ్లకు కరెంట్ కట్ అయింది. గంటకు 150 మైళ్లవేగంతో గాలులు వీచాయని, వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయని నేషనల్ హరికేన్ సెంటర్ వెల్లడించింది. అయితే గురువారం అర్దరాత్రి టైంకు హరికేన్
బలహీనపడిందని, లూసియానాకు ఉత్తర దిక్కుగా దిశను మార్చుకుందని తెలిపింది. హరికేన్ వల్ల నార్తర్న్ లూసియానా, అర్కాన్సాస్ లో బలమైన ఈదురుగాలులు, వరదలు కొనసాగుతున్నాయని పేర్కొంది. అనేక ప్రాంతాల్లో పవర్ కట్ అవడంతో దాదాపు 8.40 లక్షల మంది చీకట్లో మగ్గుతున్నారు. ఒక్క లూసియానాలోనే పవర్ కట్ అయిన ప్రాంతాల్లో 6 లక్షల మంది ఉన్నారు. లూసియానా స్టేట్ లోని గల్ఫ్ కోస్ట్ వెంబడి ఉన్న ప్రాంతాలు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి. గోల్ఫ్ కోస్ట్ లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శనివారం పర్యటించి, హరికేన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు.
For More News..