అధిక వడ్డీ పేరుతో రూ.13 కోట్ల చీటింగ్..భార్యాభర్తలు అరెస్ట్

అధిక వడ్డీ పేరుతో రూ.13 కోట్ల చీటింగ్..భార్యాభర్తలు అరెస్ట్

ఎక్కువ వడ్డీ ఇస్తా మని ఫైనాన్స్ చీటింగ్‌ చేస్తున్న భార్యా భర్తలను సిటీ సెంట్రల్‌ క్రైమ్‌‌పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి మొబైల్‌ ఫోన్స్‌‌, డిపాజిట్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి శుక్రవారంవివరాలు వెల్లడిం చా రు. బోరబండ మోతీనగర్‌‌‌‌కి చెందిన పీట పద్మజ(42), వెంకటసుబ్రమణ్య వరప్రసా ద్‌‌(47) భార్యాభర్తలు. శ్రీనగర్‌‌‌‌కాలనీలో రుణధార ఫైనాన్సియల్‌ సర్వీసె స్ఆఫీస్‌ ఓపెన్‌ చేసి, సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు, హీరోలతో పరిచయాలున్నాయని స్థానికులను నమ్మించారు. ప్రొడ్యూసర్లకు ఎక్కువ వడ్డీకి అప్పులు ఇస్తామని చెప్పేవాళ్లు. తమ ఫైనాన్స్‌‌లో డిపాజిట్చేస్తే రూ.5 నుంచి రూ.15 ఇంట్రస్ట్‌ ఇస్తామంటూ చాలా మంది రూ.లక్షల్లోడబ్బుతీసుకున్నారు. సో మాజిగూడకు చెందిన బొడ్డువిజయలక్ష్మీ దాదాపు రూ.కోటి డిపాజిట్‌ చేసింది. ఇం ట్రస్ట్, డిపాజిట్‌ చేసిన డబ్బు ఇవ్వకుండా తప్పించుకుంటుండడంతో బాధితురాలు సీసీఎస్‌పోలీసులకు కంప్లయింట్చేసింది. వైట్‌ కాలర్స్ ‌‌ఆఫెన్సెస్‌ వింగ్‌ ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ సూర్య ప్రకాశ్‌ ‌టీమ్‌ ‌నిందితులను అరెస్ట్ చేసింది. 20 మంది నుంచి రూ.13 కోట్ల డిపాజిట్లు తీసుకున్నట్లు ఎవిడెన్స్ సేకరిం చింది. స్వధాత్రి ఇన్‌ఫ్రా ఫ్రాడ్ కేసులోనూ వీళ్లు నిందితులుగా ఉన్నట్లు గుర్తించింది.