కరోనాతో వారంలో భార్యభర్తలు మృతి.. హాజరైన మరో 9 మందికి పాజిటివ్

కరోనాతో వారంలో భార్యభర్తలు మృతి.. హాజరైన మరో 9 మందికి పాజిటివ్

కామారెడ్డి పంచముఖి హనుమాన్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో చికిత్స పొందుతూ స్రవంతి(30) అనే మహిళ మృతిచెందింది. ఆమె భర్త రాజేష్ (35) కూడా వారం రోజుల క్రితం కరోనా లక్షణాలతో చనిపోయాడు. వారం రోజుల్లో ఒకే ఇంట్లో భార్యభర్తలు చనిపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం రాజేష్ తల్లిదండ్రులు మరియు కూతురికి కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా.. రాజేష్ అంత్యక్రియలకు హాజరైన మరో 9 మందికి కూడా కరోనా సోకినట్లు కన్ఫర్మ్ అయింది. ఆ రోజు రాజేష్ అంత్యక్రియలకు దాదాపు 70 మంది హాజరైనట్లు తెలుస్తోంది. అధికారులు వారందరిని ట్రేస్ చేస్తున్నారు.

For More News..

రాష్ట్రంలో 88 వేలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో 2,76,398 కరోనా కేసులు

ప్రధానిగా మోడీ కొత్త రికార్డు