
సింకింద్రాబాద్ లో ఘోర జరిగింది. రెజిమెంటల్ బజార్ లో బిల్డింగ్ మీద నుంచి భార్య భర్తలు జారీ పడ్డారు. నిర్మాణంలో ఉన్న భవనంలో రెండో అంతస్తు నుంచి గిరి, లచ్చమ్మ దంపతులు కింద పడ్డారు.స్థానికులు ఘటనను గమనించిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.
భర్త గిరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. భార్య లచ్చమ్మను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామన్నారు.