V6 News

భార్య సర్పంచ్, భర్త ఉప సర్పంచ్

భార్య సర్పంచ్, భర్త ఉప సర్పంచ్

ఇంద్రవెల్లి (ఉట్నూర్), వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లింగోజితండా సర్పంచ్‌‌, ఉప సర్పంచ్‌‌ పదవులు భార్యాభర్తలకు దక్కాయి. సర్పంచ్‌‌ క్యాండిడేట్లుగా జాదవ్ మాయ, విమల బరిలో దిగగా... 88 ఓట్ల తేడాతో మాయ విజయం సాధించింది. 

ఎన్నికల కౌంటింగ్‌‌ అనంతరం ఉప సర్పంచ్‌‌ ఎన్నిక నిర్వహించారు. మాయ భర్త, వార్డు సభ్యుడిగా గెలిచిన హరినాయక్‌‌ను ఉపసర్పంచ్‌‌గా ఎన్నుకున్నారు. ఒకే ఇంట్లో భార్యాభర్తలకు పదవులు దక్కడంతో కుటుంబసభ్యులు, మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోయారు.