ఏకాంతంగా ఉన్న ఫొటోలు పంపి భార్యను బ్లాక్ మెయిల్ చేసిన భర్త

ఏకాంతంగా ఉన్న ఫొటోలు పంపి భార్యను బ్లాక్ మెయిల్ చేసిన భర్త

డబ్బు కోసం భార్యనే బ్లాక్ మెయిల్ చేశాడో భర్త. ఆమె అతనితో ఏకాంతంగా ఉన్నప్పటి ఫొటోలు పంపి లక్షలు కొల్లగొట్టాడు. ఇదంతా చేయడానికి నకిలీ మెయిల్ ఐడీని సృష్టించి ఈ నాటకానికి తెరతీశాడు. కరీంనగర్ లోని మంకమ్మ తోట ఏరియాకు చెందిన గుగ్లొత్ సంతోష్ కుమార్ అలియాస్ సత్య హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి మాట్రిమోనియల్ ద్వారా అమెరికాలో నివాసముంటున్న లేల్ల ప్రమీల అనే ఎన్ఆర్ఐ మహిళను వివాహం చేసుకున్నాడు. ఏప్రిల్ 12, 2016న వీరిద్దరి పెళ్లి పెద్దల సమక్షంలో అంగరంగవైభవంగా జరిగింది. వివాహ సమయంలో కట్నం కింద 10 లక్షల నగదు, ఆడపడుచు కట్నం కింద 5 లక్షలు ఇచ్చారు. వివాహం జరిగిన తర్వాత ప్రమీల ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లిపోయింది.

ఆ తర్వాత కొన్నాళ్లకు సంతోష్ నకిలీ గుర్తింపు కార్డు తయారుచేసి హర్షవర్ధన్ రెడ్డి పేరుతో సిమ్ కార్డు సంపాదించాడు. అలాగే నకిలీ మెయిల్ ఐడీ సృష్టించి.. ఆమె తనతో ఏకాంతంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలు ప్రమీలకు మెయిల్ చేశాడు. దాంతో ఆందోళనకు గురైన ప్రమీల.. తన భర్తకు సమాచారం ఇచ్చింది. అయితే సంతోష్.. సమస్య పరిష్కారం చేస్తానని మోసపూరిత మాటలు చెప్పి ప్రమీల మరియు ఆమె తండ్రి నుంచి 63 లక్షలు తీసుకున్నాడు. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన ప్రమీల.. ఇండియాకు వచ్చిన తర్వాత గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. సంతోష్ తన పేరును సత్య హర్షవర్ధన్ రెడ్డి అనే మార్చకొని ప్రమీలకు అసభ్యకర మెసేజ్ లు మరియు ఫొటోలు పంపినట్లు నిర్దారించారు. ఎన్ఆర్ఐ మహిళను మానసికంగా వేధించి.. ఆమె నుంచి డబ్బులు వసూలు చేసినందుకు సంతోష్ పై సెక్షన్ 498-ఏ, 323, 406, 419, 506, 509 మరియు 3,4 డీపీ చట్టం ప్రకారం గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదుచేశారు. సంతోష్ ని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు మాదాపూర్ ఏసీపీ శ్యాం ప్రసాద్ తెలిపారు.

For More News..

వైరల్ వీడియో: రాత్రంతా పది హాస్పిటళ్లు తిరిగినా చేర్చుకోలేదు.. నా భార్యని చంపేశారు

తండ్రి కోసం దిష్టిబొమ్మను పెళ్లి చేసుకున్న యువకుడు

ప్రైవేట్ దందా.. ఐసోలేషన్ బెడ్ రోజుకి రూ. 24,000-25,000