
గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలంలో దారుణ హత్య జరిగింది. వృద్ధ దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో భర్త అక్కడి కక్కడే చనిపోగా…భార్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. కాశిపాడులో కిరాణ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు పులిపాటి రాధాకృష్ణమూర్తి,భార్య వెంకట నరసమ్మ. వీరిపై దుండగులు దాడి చేసి వెంకటనరసమ్మ ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకెళ్లారు. విషయం తెలసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వెంకటనరసమ్మను గుంటూరు ఆస్పత్రికి తరలించారు.
గతంలో కూడా ఇదే తరహాలో క్రోసూరు మండలం గుడిపాడు,రాజుపాలెం మండలం కొండమోడు లో ఒంటరిగా ఉంటున్న జంటల హత్యలు జరిగాయి.