
కలికాలం ఏమైనా జరగొచ్చు అంటే ఏమో అనుకున్నాం..ప్రస్తుతం జరుగుతోన్న కొన్ని పరిణామాలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. ఆస్తి కోసం హత్యలు, వివాహేతర సంబంధాలు, భర్తలను భార్య చంపడం,భార్యలను భర్త చంపడం, సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయాలతో పుట్టిన బిడ్డలను కట్టుకున్న భర్తను వదిలేసి దేశాలు దాటి రావడం వంటి సంఘటనలు మనం చూస్తున్నాం.
లేటెస్ట్ గా ఓ వ్యక్తి తన భార్యా ఇద్దరు పిల్లలను వదిలేసి ఓ ట్రాన్స్ జెండర్ తో సహజీవనం చేస్తున్నాడు. పక్కా ప్లాన్ తో సహజీవనం చేస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది భార్య. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాలలో జరిగింది.
జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్‌కు, పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యతో 2014లో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల రాజశేఖర్, హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్ జెండర్ దీపుతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడు. భార్య లాస్యను వదిలి, దీపుతో సహజీవనం ప్రారంభించాడు. భార్యా పిల్లలను వదిలేసి ట్రాన్స్ జెండర్‌తో కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నాడు.
విషయం తెలిసిన భార్య లాస్య, మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. లాస్య ఆసుపత్రిలో ఉన్నప్పటికీ భర్త రాజశేఖర్ హాస్పిటల్ కు రాకపోవడంతో ఆందోళనకు గురైన అత్తమామలు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఏకంగా తన ఇంట్లోనే ట్రాన్స్ జెండర్ దీపుతో కలిసి ఉన్న రాజశేఖర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూమ్ కు తాళం వేసి అనంతరం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు రాజశేఖర్ దీపులను స్టేషన్‌కు తెరలించారు. స్థానికంగా ఈ విషయం చర్చనీయంశంగా మారింది.