భార్య మృతికి కారణమైన భర్తకు ఏడేళ్ల జైలు

భార్య మృతికి కారణమైన భర్తకు ఏడేళ్ల జైలు

ఉప్పల్, వెలుగు: అదనపు కట్నం కోసం వేధించి భార్య ఆత్మహత్యకు కారణమైన వ్యక్తికి మేడ్చల్– మల్కాజిగిరి సెషన్ కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. ఉప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని విశాఖపట్నం బుచ్చిరాజుపాలెంకు చెందిన జయలక్ష్మితో అదే ప్రాంతానికి చెందిన వేదువాక సురేశ్(42)కు 2011లో పెండ్లి జరిగింది. ఏడాది తర్వాత వారికి ఒక బాబు పుట్టాడు. పెండ్లి టైంలో కట్నం కింద రూ.10 లక్షలు క్యాష్, 5 తులాల బంగారం తీసుకున్న సురేశ్, బాబు పుట్టాక అదనపు కట్నం కోసం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. తట్టుకోలేక పోయిన జయలక్ష్మి 2014 జులై14న ఇంట్లో ఉరివేసుకుంది. అల్లుడి వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి జగన్నాథం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సురేశ్​ను అరెస్టు చేసి రిమాండు తరలించారు. కొద్దిరోజుల తర్వాత సురేశ్ బెయిల్ పై విడుదలై బయటికి వచ్చాడు. పూర్తి విచారణ అనంతరం ఉప్పల్ పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి సెషన్స్​కోర్టు జడ్జి రఘునాథరెడ్డి శుక్రవారం సురేశ్​కు ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.