
భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రుడి ఆలయ ఆదాయం రూ.2 కోట్లకు చేరిస్తే సీఎం కేసీఆర్ను తీసుకొస్తానని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్చెప్పారు. జనవరి10 నుంచి భద్రకాళి సమేత వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
మంగళవారం వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో అడిషనల్కలెక్టర్సంధ్యారాణి రివ్యూ మీటింగ్ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ.. ఈసారి జాతరలో పాసులతోపాటు టికెట్లు అమ్మితే ఆలయ ఆదాయం పెరుగుతుందని చెప్పారు. తర్వాత బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు. జడ్పీ చైర్మన్డా.సుధీర్‌కుమార్, ఎంపీపీ జక్కులఅనిత, జడ్పీటీసీ వంగ రవి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్మాడిశెట్టి కుమారస్వామి, ఈఓ కిషన్‌రావు, సర్పంచ్దూడల ప్రమీల, ఎంపీటీసీ రాజమణి పాల్గొన్నారు.