బస్టో అర్సిజియో (ఇటలీ) : తెలంగాణ స్టార్ బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్.. వరల్డ్ ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫయర్స్ టోర్నీలో నిరాశపరిచాడు. శనివారం జరిగిన మెన్స్ 57 కేజీ రెండో రౌండ్‌లో హుస్సామ్ 0–4తో జూడ్ గల్లఘర్ (ఐర్లాండ్) చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి రౌండ్‌లో బై లభించడంతో నేరుగా రెండో రౌండ్ ఆడిన హుస్సామ్ స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయాడు.
