మూకమామిడిలో పిడుగుపాటుకు గుడిసె దగ్ధం

మూకమామిడిలో పిడుగుపాటుకు గుడిసె దగ్ధం

ములకలపల్లి, వెలుగు : పిడుగుపాటుకు గుడిసె దగ్ధమైనఘటన  మండలంలోని మూకమామిడిలో  బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుప్పాల వేణి, ములికేశ్వరరావు దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. ఇంటి నిర్మాణం కోసం వారు ఉంటున్న గుడిసెను తొలగించి దగ్గరలో ఉన్న గొడ్డేటి సురేశ్​ కు సంబంధించిన గుడిసెలో ఉంటున్నారు.

 కాగా, బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంలో ఆ గుడిసెపై పిడుగు పడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కానీ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కొత్తగూడెం నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పింది.