హుజూర్ నగర్ లో ముగిసిన పోలింగ్…

హుజూర్ నగర్ లో ముగిసిన పోలింగ్…

హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్.. 5గంటలకు క్లోజ్ అయింది. అయితే 5గంటల్లోపు క్యూ లైన్లో నిలుచున్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించారు అధికారులు. హుజూర్ నగర్ లో ఓవరాల్ గా 70శాతానికి పైగా పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. గుండ్లపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి.. కీతవారిగూడెంలో బీజేపీ అభ్యర్ధి కోటా రామారావు, హుజూర్ నగర్ లో టీడీపీ అభ్యర్ధి కిరణ్మయి ఓటు వేశారు.

నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో మొత్తం 302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. 79 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించడంతో ఉద్యయం క్యూలైన్లలో వేచి ఉన్నారు ఓటర్లు. పనిచేయని ఈవీఎంలను అధికారులు రీప్లేస్ చేయడంతో.. ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా..  హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది.