పోస్ట‌ల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

పోస్ట‌ల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

హుజురాబాద్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని ప్రదర్శించి ముందంజలో ఉంది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గాను టీఆర్ఎస్‎కు ఎక్కువగా ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. విద్యావంతులు అధికారపార్టీ వైపే మొగ్గుచూపినట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ 503, బీజేపీ 159, కాంగ్రెస్ 32 ఓట్లు పోలయ్యాయి. కాగా.. చెల్లని ఓట్లు 14 నమోదయ్యాయి. మొత్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ 344 ఓట్ల ముందంజలో ఉంది.

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ఉద‌యం 8 గంట‌ల ప్రారంభ‌మైంది. ఫస్ట్ 753 పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల‌ను లెక్కిస్తున్నారు. తర్వాత ఈవీఎంల్లోని ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. క‌రీంన‌గ‌ర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీల్లో ఓట్ల లెక్కింపున‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏడు టేబుళ్ల చొప్పున 2 కేంద్రాల్లో 14 టేబుళ్ల‌పై ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. మొత్తం 22 రౌండ్ల‌లో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ముగియ‌నుంది. ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది.