విమెన్స్ హాకీ నేషన్స్ కప్ బరిలో ఇండియా

విమెన్స్ హాకీ నేషన్స్ కప్ బరిలో ఇండియా

లాసానె (స్విట్జర్లాండ్): ఎఫ్ఐహెచ్  హాకీ నేషన్స్ కప్‌‌‌‌లో ఇండియా విమెన్స్ టీమ్ తలపడనుంది. న్యూజిలాండ్‌‌‌‌లోని అక్లాండ్ వేదికగా జూన్ 15 నుంచి 21 వరకు ఈ టోర్నీ జరుగుతుందని ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ సోమవారం ప్రకటించింది. హాకీ ప్రో లీగ్‌‌‌‌లో ఆడే అవకాశం లేని టాప్ టీమ్స్ కోసం 2021లో నేషన్స్ కప్‌‌‌‌ను ప్రారంభించారు. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు తర్వాతి సీజన్ ప్రో లీగ్‌‌‌‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది.

2024-25 ప్రో లీగ్ సీజన్‌‌‌‌లో ఆఖరి స్థానంలో నిలిచిన ఇండియా అమ్మాయిల టీమ్ రెలిగేట్ కావడంతో, ఇప్పుడు మళ్లీ ప్రో లీగ్‌‌‌‌లో చోటు దక్కించుకోవడానికి  నేషన్స్ కప్ కీలకం కానుంది. ఈటోర్నీలో ఇండియాతో పాటు ఆతిథ్య న్యూజిలాండ్, అమెరికా, జపాన్, కొరియా, చిలీ, స్కాట్లాండ్, ఫ్రాన్స్ జట్లు పాల్గొంటున్నాయి.