
ఇప్పటి వరకు 7 సార్లు జరిగిన హుజుర్ నగర్ నియోజకవర్గ ఫలితాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి శానం పుడి సైదిరెడ్డి అత్యధిక మెజారిటీని సాధించారు. 2009 ఎన్నికల్లో 29194 ఓట్లు ఆధిక్యత లభించింది. హుజూర్ నగర్ బైపోల్ ఎన్నికల ఫలితాల్లో సైదిరెడ్డికి 29,967ఓట్ల ఆధిక్యం రావడంతో గత రికార్డ్ బ్రేక్ అయ్యింది. ఈ రికార్డ్ ని సైదిరెడ్డి 15 వ రౌండ్ లొనే అధిగమించారు. 18వ రౌండ్ పూర్తయ్యేసరికి 36 వేలు ఆధిక్యం. 20వ రౌండ్ పూర్తయ్యేసరికి 40 వేలు ఆధిక్యం.