మత్స్య సొసైటీని రద్దు చేయాలి : హుజూర్ నగర్ ముదిరాజ్ కమ్యూనిటీ కులస్తులు

మత్స్య సొసైటీని రద్దు చేయాలి : హుజూర్ నగర్ ముదిరాజ్ కమ్యూనిటీ కులస్తులు

సూర్యాపేట, వెలుగు: హుజూర్ నగర్ ప్రస్తుత మత్స్య శాఖ సొసైటీని రద్దు చేయాలని కోరుతూ హుజూర్ నగర్ ముదిరాజ్ కమ్యూనిటీ కులస్తులు మంగళవారం అడిషనల్ కలెక్టర్ కె. సీతారామరావును కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  హుజూర్ నగర్ మత్స్య శాఖ సొసైటీ సభ్యత్వాల పేరుతో రెండేళ్ల క్రితం 400 మంది దగ్గర రూ.2వేలు చొప్పున రూ,8 లక్షలు తీసుకొని సభ్యత్వాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని  తెలిపారు. 

ఇటీవల మత్స్య శాఖ సొసైటీలో ముగ్గురు చనిపోతే వారికి ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే అసలు సభ్యత్వాలు లేవని చెప్పారన్నారు.  దీనితో సభ్యత్వాలపై నిలదీస్తే సభ్యత్వాలు చేయలేదని చెప్పడంతో అసలు మోసం బయటపడిందన్నారు. జిల్లా అధికారులు స్పందించి జిల్లా ఫిషరీస్ అధికారితో ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలని కోరారు. 

ఈ సందర్భంగా జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ తో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లారీ పిచ్చయ్య, పిట్టల రవి, కొప్పెర శీను, ములకలపల్లి సీతయ్య, రాంగ్ గోపి, లింగం మధు, పోతన బోయినపల్లి రామ్మూర్తి పంగా సైదులు, కంటూ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.