పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు పటిష్ఠ చర్యలు : ఎస్పీ నరసింహ

పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు పటిష్ఠ చర్యలు : ఎస్పీ నరసింహ

హుజూర్ నగర్, వెలుగు: జిల్లాలోని సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, నేరేడుచర్ల, హుజూర్ నగర్ మున్సిపాలిటీల పోలింగ్ కు, పోలింగ్ బాక్సుల తరలింపు రక్షణకు, కౌంటింగ్ కు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్టు  ఎస్పీ నరసింహ తెలిపారు. బుధవారం హుజూర్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా  ఎస్పీ మాట్లాడుతూ..  జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల కోసం ఐదు అంచెల భద్రత చర్యలు  తీసుకున్నట్లు తెలిపారు.

దీనికోసం ఎస్సైల ఆధ్వర్యంలో రూట్ మొబైల్ టీమ్స్, సీఐల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్సెస్,  డీఎస్పీల ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సును ఉపయోగించామన్నారు. 2 అడిషనల్ ఎస్పీలు, 4 డీఎస్పీలు,15 సీఐలతో పాటు 1250 మంది సిబ్బంది, 2 స్పెషల్ ప్లాటును పోలీసులు భద్రతా చర్యలో పాల్గొన్నట్టు తెలిపారు. ఈ నెల 13న జరిగే కౌంటింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.  కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ చరమందరాజు, ఎస్సై మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.