అలంపూర్ నామినేషన్ల పరిశీలనలో హైడ్రామా

అలంపూర్  నామినేషన్ల పరిశీలనలో  హైడ్రామా
  • బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించాలని కాంగ్రెస్, బీఎస్పీ క్యాండిడేట్ల డిమాండ్ 
  • ఆర్వో వెహికల్ అడ్డగింత

అలంపూర్: గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ నామినేషన్ల పరిశీలనలో హైడ్రామా చోటుచేసుకున్నది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయుడు నామినేషన్ ను తిరస్కరించాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న కుమార్ డిమాండ్​చేశారు. విజయుడు ఉండవెళ్లి మండలం పుల్లురు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేశారని.. దానికి సంబంధించిన రాజీనామా పత్రాన్ని ఎన్నికల అఫిడవిట్ లో పొందపరచలేదని రిటర్నింగ్ అధికారి (ఆర్వో) చంద్రకళకి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆర్వో వెహికల్ ను అడ్డుకోవడంతో కాసేపు హై డ్రామా కొనసాగింది.

ALSO READ :- కార్తీక పురాణం విశిష్ఠత : మహా విష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన కథేనా..!