హైదరాబాద్ లో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని పసిగట్టారా ఇక అంతే వారి ఇళ్లపై ఏసీబీ స్టాఫ్ వాలిపోతుంది. ఇలా ఉండగా ఈ రోజు ఉదయం ( జూన్ 9) హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ముమ్మర సోదాలు చేపట్టారు. మంగళవారం ( జూన్ 9) ఉదయం నుంచి ఆర్ అండ్ బీ (R&B) ఈఎన్సీ మోహన్ నాయక్ నివాసంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ దాడుల్లో భాగంగా మియాపూర్ పరిసర ప్రాంతాల్లోని 11 చోట్ల ఏకకాలంలో ఏసీబీ బృందాలు సోదాలు కొనసాగిస్తున్నాయి. ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
